న్యూఢిల్లీ, నవంబర్ 6 : ఆన్లైన్ పేమెంట్స్ వేదిక పేటీఎం.. కస్టమర్లకు ఓ బంగారు అవకాశాన్నిచ్చింది. లాయల్టీ పాయింట్స్‌ను గోల్డ్‌లోకి మార్చుకునే ప్లాన్‌ను తీసుకొచ్చామని గురువారం ప్రకటించింది.
నిర్దిష్ట పరిమితి దాటాక పర్సన్-టు-పర్సన్ నగదు బదిలీలకూ ఇది వర్తిస్తుందని పేటీఎం చీఫ్ విజయ్ శేఖర్ శర్మ తెలిపారు. ఇదిలావుంటే సరికొత్త ఏఐ ఫీచర్లతో ఓ కొత్త వెర్షన్ ట్రావెల్ యాప్‌నూ పేటీఎం పరిచయం చేసింది.