ఎక్కువ ఈఎంఐ కట్టడమా?.. కాల వ్యవది పెంచుకోవమా?.. ఆర్బీఐ వడ్డీరేటు పెంచిన తరువాత ఏది బెటర్
వడ్డీభారాన్ని బ్యాంకులు రెండు రకాలుగా విధిస్తుంటాయి. నెలవారి EMI పెంచడం, లోన్ కాలవ్యవధిని పెంచడం. మరి ఈ రెండింటిలో దేన్ని ఎంచుకుంటే రుణగ్రహీతలకు ఎక్కువ మేలు...
అక్టోబర్ 7న ఆర్బీఐ రెపో రేటు 0.25% మేర పెంచింది. 2023 తరువాత రెపోరేటును పెంచడం ఇదే మొదటిసారి. ఫ్లోటింగ్ వడ్డీరేటు నిబందన కింద లోన్ తీసుకున్న రుణగ్రహీతలకు దీని ప్రభావం వెంటనే కనిపిస్తుంది. ఈ వడ్డీభారాన్ని బ్యాంకులు రెండు రకాలుగా విధిస్తుంటాయి. నెలవారి EMI పెంచడం, లోన్ కాలవ్యవధిని పెంచడం. మరి ఈ రెండింటిలో దేన్ని ఎంచుకుంటే రుణగ్రహీతలకు ఎక్కువ మేలు జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం.
ఉదాహరణకు ఒక వ్యక్తి హోమ్ లోన్ 20 సంవత్సరాలకుగాను 8% వడ్డీ రేటుతో నెలకు సుమారు రూ. 41,822 EMI కడుతున్నాడు అనుకుందాం. ఇప్పుడు ఆర్బీఐ వడ్డీ రేటు 0.25% పెరిగి 8.25% అయింది. లోన్ తీసుకున్న వ్యక్తి కొంచెం ఆర్థికంగా భారం అయినా సరే అనుకుని ఎక్కువ EMI చెల్లించడానికి నిర్ణయం తీసుకున్నాడు అనుకుందాం. అప్పుడు అతని EMI నెలకు రూ. 41,822 నుంచి రూ. 42,600కి పెరుగుతుంది. అంటే నెలకు అదనంగా 780 రూపాయలు చెల్లించాలి. 20 ఏళ్లకు(240నెలలు) 1,87,200 రూపాయలు అదనంగా చెల్లించాలి.
ఒకవేళ అతను నెలనెల ఆర్థికంగా భారం అనుకుని (రెండో ఆప్షన్) లోన్ కాలవ్యవధి పెంచుకుందాం అనకుంటే… ముందుగా ఉన్న 20 సంవత్సరాల లోన్ కాలవ్యవధి కాస్త 21 సంవత్సరాలకు పెరుగుతుంది. అంటే.. 240 నెలల నుంచి 252 నెలలకు పెరుగుతుంది. రూ. 41,822 చొప్పున అదనంగా 12 నెలలు ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. సుమారుగ రూ. 5 లక్షలకు పైగా అవుతుంది. లోన్ కాలవ్యవధి పెంచుకుంటే ఈఎంఐ ద్వారా చెల్లించేదానికంటే 3లక్షల రూపాయలు ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అంటే.. ఇక్కడ ఎక్కువ EMI ఆప్షన్ ఎంచుకోవడమే రుణగ్రహీతకు లాభం చేకూరుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- emi
- Interest Rates
- rbi
- repo rate
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎక్కువ ఈఎంఐ కట్టడమా?.. కాల వ్యవది పెంచుకోవమా?.. ఆర్బీఐ వడ్డీరేటు పెంచిన తరువాత ఏది బెటర్
Trishula Snanarchana | వేయిస్తంభాల ప్రాచీనకోనేరులో త్రిశూలస్నానార్చన
Theft Attempt | దొంగతనం చేసేందుకు సీసీ కెమెరాను బ్లర్ చేశారు.. కానీ ఏమైందో చూడండి.. వీడియో
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

