PAN Card | డిపాజిట్లు రూ.50 వేలు దాటితే ‘పాన్’ తప్పనిసరి.. రూ.2000నోటు ఉపసంహరణపై ఆర్బీఐ
PAN Card | రూ.50 వేలు, అంతకంటే ఎక్కువ బ్యాంకులో డిపాజిట్ చేస్తే పాన్ కార్డు సమర్పించాల్సిందేనని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఈ నిబంధన రూ.2000కరెన్సీ నోట్ల డిపాజిట్ కూ వర్తిస్తుందన్నారు.
PAN Card | మార్కెట్లో నుంచి ఉపసంహరిస్తున్న రూ.2000 కరెన్సీ నోట్ల డిపాజిట్లు, మార్పిడిపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పందించారు. ఏదేనీ బ్యాంకులో రూ.50 వేలు అంత కంటే ఎక్కువ రూ.2000 కరెన్సీ నోట్లు డిపాజిట్ చేస్తే ‘పాన్ కార్డు’ సమర్పించాల్సిందేనని చెప్పారు. ఈ నిబంధన ఇప్పటికే అమల్లో ఉందని తెలిపారు. రూ.2000 నోట్ల ఉపసంహరణకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఉందని చెప్పారు. కరెన్సీ నిర్వహణలో భాగంగానే రూ.2000నోటు ఉపసంహరిస్తున్నట్లు వెల్లడించారు.
RBI Governor: రూ.1000 నోట్‌ను మళ్లీ తీసుకోస్తారా? ఆర్బీఐ గవర్నర్ ఏమన్నారంటే
మార్కెట్ నుంచి రూ.2000 నోటు ఉపసంహరిస్తున్నట్లు శుక్రవారం ఆర్బీఐ అకస్మిక ప్రకటన చేసిన తర్వాత శక్తికాంత దాస్ సోమవారం తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఏరోజుకా రోజు రూ.2000 నోట్ల డిపాజిట్లు, మార్పిడిపై నియంత్రణ కొనసాగుతుందన్నారు. మంగళవారం (మే 23) నుంచి బ్యాంకుల్లో రూ.2000 నోటు డిపాజిట్లకు అనుమతి ఇచ్చింది ఆర్బీఐ.
RBI Governor: బ్యాంకులకు పోటెత్తకండి.. 2వేల నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ గవర్నర్
రూ.2000 నోట్లు డిపాజిట్ చేయడానికి, మార్పిడి కోసం వచ్చే ప్రజలకు బ్యాంకుల వద్ద నీడ, తాగునీటి వసతి కల్పించాలని బ్యాంకులకు ఆర్బీఐ హితవు చెప్పింది. ప్రస్తుతం మండు వేసవి నేపథ్యంలో భారీగా ఖాతాదారులు బారులు తీరడం వల్ల వేచి ఉండాల్సి వస్తుంది. అటువంటి వారికి సేద తీరడానికి వీలుగా నీడ కల్పించాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచించింది. 2016లో పాత పెద్ద నోట్లు (రూ.1000, రూ.500) ఉపసంహరించినప్పుడు ఆయా నోట్ల మార్పిడికి బ్యాంకుల వద్ద బారులు తీరిన ప్రజలు మరణించారన్న వార్తలు వచ్చాయి. రూ.2000నోట్ల డిపాజిట్లు, మార్పిడికి ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆర్బీఐ సూచించింది.
RBI Guidelines | రూ.2000 నోటు రద్దు.. ఆర్బీఐ గైడ్ లైన్స్‌లో గందరగోళం..!
మళ్లీ మార్కెట్లోకి చలామణిలోకి రూ.1000కరెన్సీ నోటు తెచ్చే ప్రతిపాదనేదీ ఆర్బీఐ వద్ద లేదని శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. 2016లో ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకుని, రూ.2000 కరెన్సీ నోటు తెచ్చామన్నారు. ఇప్పుడు వ్యవస్థలో సరిపడా కరెన్సీనోట్లు ఉన్నాయని, అందువల్లే రూ.2000 నోటు ఉపసంహరిస్తున్నామన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

