హైదరాబాద్, మే 12 : అమెజాన్ బజార్‌కు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ ఆర్డర్లు నాలుగింతలు పెరిగాయి. గడిచిన ఏడాదికాలంలో ఒక హైదరాబాద్‌లోనే నాలుగింతల ఆర్డర్లు అధికమయ్యాయని అమెజాన్ బజార్ హెడ్ సమీర్ లాల్వానీ తెలిపారు. ప్రస్తుతేడాది తొలి నాలుగు నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో కొత్త కస్టమర్లు నాలుగింతలు చేరారని తెలిపారు.
వీటిలో మహిళా ఫ్యాషన్ ఆర్డర్లు ఆరు రెట్లు అధికమవగా, గృహోపకరణాలు ఎనిమిదింతలు, ఎలక్ట్రానిక్ యాక్సెస్సరీస్ నాలుగింతలు చొప్పున పెరిగాయని చెప్పారు. ఏపీ, తెలంగాణ నుంచి సంస్థకు 75 వేల సెల్లర్లు ఉన్నారు. మెట్రో నగరాలతోపాటు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి ఆర్డర్లు పెరిగాయన్నారు.