Oppo Reno 13 5G | ఒప్పో రెనో 13 సిరీస్ ఫోన్ల ఆవిష్కరణకు ముహూర్తం ఖరారు.. ఇవీ డిటెయిల్స్..!
Oppo Reno 13 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో రెనో 13 5జీ సిరీస్ ఫోన్లను భారత్, సెలెక్టెడ్ గ్లోబల్ మార్కెట్లలో ఈ నెల తొమ్మిదో తేదీన ఆవిష్కరిస్తారు.
Oppo Reno 13 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో రెనో 13 5జీ సిరీస్ ఫోన్లను భారత్, సెలెక్టెడ్ గ్లోబల్ మార్కెట్లలో ఆవిష్కరించేందుకు ముహూర్తం ఖరారైంది. ఒప్పో రెనో 13 5జీతోపాటు ఒప్పో రెనో 13, ఒప్పో రెనో 13 ప్రో ఫోన్లను కూడా ఆవిష్కరిస్తారు. గతేడాది నవంబర్ నెలలో చైనా మార్కెట్లో ఒప్పో రెనో 13 5జీ సిరీస్ ఫోన్లను ఆవిష్కరించారు. ఈ నెల తొమ్మిదో తేదీ సాయంత్రం ఐదు గంటలకు ఒప్పో రెనో 13 5జీ సిరీస్ ఫోన్లను ఆవిష్కరిస్తామని ఒప్పో తెలిపింది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్, ఒప్పో ఇండియా ఈ-స్టోర్ ద్వారా ఈ ఫోన్లు విక్రయిస్తారు.
ఒప్పో రెనో 13 5జీ సిరీస్ ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ లేదా 256 జీబీ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది. ఐవోరీ వైట్, లుమినియస్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుందీ ఫోన్. ఒప్పో రెనో 13 ప్రో ఫోన్ 256 జీబీ స్టోరేజీ లేదా 512 జీబీ స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుందని ధృవీకరించారు. గ్రాఫైట్ గ్రే, మిస్ట్ లావెండర్ రంగుల్లో ఫోన్ అందుబాటులో ఉంటుంది.
ఒప్పో రెనో 13 5జీ సిరీస్ ఫోన్లు సిగ్నల్ బూస్ట్ ఎక్స్ 1 చిప్స్ తోపాటు మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఎస్వోసీ ప్రాసెసర్‌తో వస్తున్నాయి. ఏఐ బ్యాక్డ్ ఇమేజింగ్ ఫీచర్లు ఉంటాయి. 50-మెగా పిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా విత్ 3.5ఎక్స్ ఆప్టికల్ జూమ్ అండ్ అప్టూ 120ఎక్స్ డిజిటల్ జూమ్ ఉంటుంది. 80వాట్ల వైర్డ్ సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5800 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. ఒప్పో రెనో 13 5జీ ఫోన్ 5600ఎంఏహెచ్ కెపాసిటీతో వస్తుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
Sai Durga Tej | చిన్ననాటి స్నేహితురాలితో పెళ్లికి సిద్ధమైన సాయి దుర్గా తేజ్.. కాబోయే భార్యకు స్పెషల్ లవ్ లెటర్!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

