న్యూఢిల్లీ : ఒప్పో రెనో 11 సిరీస్ (Oppo Reno 11 Series) నవంబర్ 23న లాంఛ్ కానుందని కంపెనీ బుధవారం వెల్లడించింది. ఒప్పో రెనో 11 సిరీస్‌లో భాగంగా ఒప్పో రెనో 11, ఒప్పో రెనో 11 ప్రొ మార్కెట్లోకి రానున్నాయి. ట్రిపుల్ రియర్ కెమెరాలతో ఎస్ఎల్ఆర్ గ్రేడ్ పోర్ట్రయిట్స్ను క్యాప్చర్ చేసే సామర్ధ్యంతో నాలుగు భిన్న రంగుల్లో ఒప్పో రెనో 11 సిరీస్ కస్టమర్ల ముందుకు రానుంది.
అప్‌కమింగ్ రెనో 11, ఒప్పో రెనో 11 ప్రో డివైజ్‌ల కోసం చైనాలో తన అధికారిక వెబ్సైట్ వీబో ద్వారా ప్రీ-రిజర్వేషన్స్‌ను ఒప్పో యాక్సెప్ట్ చేస్తోంది. తన వెబ్సైట్లో డెడికేటెడ్ ల్యాండింగ్ పేజ్ ద్వారా ఒప్పో రెనో 11 సిరీస్ డిజైన్, స్పెసిఫికేషన్స్‌ను ఒప్పో రిలీజ్ చేసింది. ఒప్పో రెనో 11 సిరీస్ స్మార్ట్ ఫోన్లు ఫ్లోరైట్ బ్లూ, మూన్‌స్టోన్, టర్వ్కీజ్, ఒబ్సిడియన్ బ్లాక్ కలర్ ఆప్షన్స్‌లో ఆకట్టుకోనున్నాయి.
ఈ స్మార్ట్ఫోన్లు ట్రిపుల్ రియర్ కెమెరాలతో కస్టమర్ల ముందుకు రానున్నాయి. లీక్స్ ఆధారంగా ఒప్పో రెనో 11 ప్రో స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్ఓసీ చిప్సెట్, సోనీ ఐఎంఎక్స్890 మెయిన్ కెమెరా, సోనీ ఐఎంఎక్స్355 అల్ట్రా వైడ్ కెమెరా, 2X ఆప్టికల్ జూమ్‌తో కూడిన సోనీ ఐఎంఎక్స్709 టెలిఫోటో సెన్సర్‌తో కస్టమర్ల ముందుకు రానుంది. ఇక ఈ హాట్ డివైజ్ 80డబ్ల్యూ చార్జింగ్ సపోర్ట్‌తో 4700ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది. ఇక ఒప్పో రెనో 11 కర్వ్డ్ డిస్ప్లేతో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 ఎస్ఓసీ చిప్‌సెట్‌పై రన్ కానుంది.
Read More : \
TCS Bengaluru | బెంగళూరు టీసీఎస్ కార్యాలయానికి బెదిరింపు కాల్..