TCS Bengaluru | బెంగళూరు టీసీఎస్ కార్యాలయానికి బెదిరింపు కాల్..
TCS Bengaluru | దేశంలోని ఐటీ దిగ్గజం టీసీఎస్ బెంగళూరు కార్యాలయానికి ‘బెదిరింపు ఫోన్’ కాల్ వచ్చింది. ఈ వార్త తెలియగానే టీసీఎస్ ఆఫీసులో పని చేస్తున్న ఉద్యోగులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు.
TCS Bengaluru | దేశంలోని ఐటీ దిగ్గజం టీసీఎస్ బెంగళూరు కార్యాలయానికి ‘బెదిరింపు ఫోన్’ కాల్ వచ్చింది. ఈ వార్త తెలియగానే టీసీఎస్ ఆఫీసులో పని చేస్తున్న ఉద్యోగులు భయాందోళనతో బయటకు పరుగులు తీశారు. మంగళవారం ఉదయం ఈ సంగతి తెలియగానే సెక్యూరిటీ అధికారులు సిబ్బందిని అప్రమత్తం చేసి, ఆఫీసు నుంచి బయటకు తరలించారు.
బెంగళూరులోని టీసీఎస్ ఆఫీసులో ‘బీ’ బ్లాక్‌ను లక్ష్యంగా చేసుకుని ఆగంతకులు బెదిరింపు కాల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సమాచారం తెలియగానే టీసీఎస్ భద్రతా అధికారులు.. పరప్పన అగ్రహారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తోపాటు భారీగా పోలీసులు టీసీఎస్ కార్యాలయానికి తరలి వచ్చి అణువణువూ గాలించారు. టీసీఎస్ భవనంలో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదని బాంబు స్క్వాడ్ పేర్కొంది. హుబ్లీ కేంద్రంగా పని చేసిన ఒక మాజీ మహిళా ఉద్యోగి ఈ బెదిరింపు కాల్ చేసినట్లు పోలీసు అధికారుల దర్యాప్తులో తేలింది.
ఆరు నెలల్లో టీసీఎస్ క్యాంపస్‌కు బెదిరింపు కాల్ రావడం రెండోసారి కావడం గమనార్హం. గత మే నెలలో హైదరాబాద్ లోని కొండాపూర్ ఆఫీసుకు సంస్థ మాజీ ఉద్యోగి బెదిరింపు ఫోన్ కాల్ చేశారని వార్తలొచ్చాయి. దాంతో దాదాపు 1500 మంది ఉద్యోగులను క్యాంపస్ నుంచి బయటకు తరలించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

