Oppo F27 | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో.. తన ఒప్పో ఎఫ్27 సిరీస్ ఫోన్లను త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఈ సిరీస్‌లో ఒప్పో ఎఫ్27, ఒప్పో ఎఫ్27 ప్రో, ఒప్పో ఎఫ్27+ ఫోన్లు ఉన్నాయి. ఐపీ69 రేటింగ్ ఫర్ డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తున్న తొలి స్మార్ట్ ఫోన్ ఒప్పో ఎఫ్27 ప్రో అని ఒప్పో పేర్కొంది. ఈ నెల 13న భారత్ మార్కెట్లో ఒప్పో ఎఫ్27ప్రో + ఫోన్ ఆవిష్కరిస్తారని తెలుస్తున్నది.
గత నెలలో చైనా మార్కెట్లో ఆవిష్కరించిన ఒప్పో ఏ3 ప్రో ఫోన్‌ను రీబ్రాండ్ చేసి భారత్ లో ఒప్పో ఎఫ్27 ప్రో+ ఫోన్‌గా ఆవిష్కరిస్తున్నారని తెలుస్తున్నది. ఒప్పో ఎఫ్27 ప్రో లేదా ఒప్పో ఎఫ్27 ప్రో + మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ఎస్వోసీ చిప్ సెట్, డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ తో వస్తాయని భావిస్తున్నారు. అందులో 64-మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ కెమెరాతోపాటు 67వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తున్నాయని భావిస్తున్నారు.