Oppo A78 |ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో తన ఏ సిరీస్‌లో ‘ఒప్పో ఏ78 4జీ’ ఫోన్ భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 680 ఎస్వోసీ చిప్ సెట్ విత్ 8జీబీ రామ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కలర్స్ ఓఎస్ 13.1 (ఆండ్రాయిడ్ వర్షన్ వెల్లడించలేదు) ఔటాఫ్ బాక్స్ వర్షన్ మీద పని చేస్తుంది. డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ గల ఈ ఫోన్ రెండు కలర్స్ లో లభిస్తుంది.
ఒప్పో ఏ78 (Oppo A78) ఫోన్ 8 జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ ధర రూ.17,499 (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. అక్వా గ్రీన్, మిస్ట్ బ్లాక్ కలర్స్‌లో లభిస్తుంది. ఒప్పో ఆన్ లైన్ స్టోర్, ఫ్లిప్‌కార్ట్, రిటైల్ చానల్స్‌లో ఆర్డర్ చేయొచ్చు. 6.42-అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1080×2400 పిక్సెల్స్) అమోలెడ్ డిస్ ప్లే విత్ 90 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది.
50-మెగా పిక్సెల్స్ ప్రైమరీ కెమెరా విత్ 77-డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ విత్ 89 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ కెమెరాలు ఉంటాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ విత్ 83 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ సెన్సర్ కెమెరా వస్తుంది.
ఒప్పో ఏ78 4జీ ఫోన్ ఇన్ బిల్ట్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీ ఉన్నా మైక్రో ఎస్డీ కార్డు సాయంతో దాని స్టోరేజీ సామర్థ్యం పెంచుకోవచ్చు. 4జీ ఎల్టీఈ, వై-ఫై, బ్లూటూత్ 5, జీపీఎస్, ఏ-జీపీఎస్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ సపోర్ట్ ఫర్ 67 వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ తో వస్తున్నది.