Oppo A3X 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో తన ఒప్పో ఏ3ఎక్స్ 5జీ (Oppo A3X 5G) ఫోన్ ను భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. స్ప్లాష్ టచ్ టెక్నాలజీతోపాటు ట్వైస్ రీఇన్ఫోర్స్డ్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్, 1000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తోపాటు 6.67 అంగుళాల హెచ్డీ + ఎల్సీడీ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, 45 వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. రెండు ర్యామ్, రెండు స్టోరేజీ వేరియంట్లలో లభిస్తుంది.
ఒప్పో ఏ3ఎక్స్ 5జీ (Oppo A3X 5G) ఫోన్ 4జీబీ ర్యామ్ విత్ 64 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.12,499, 4జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.13,499లకు లభిస్తాయి. ఒప్పో ఇండియా ఈ-స్టోర్, ఆఫ్ లైన్ రిటైల్ స్టోర్లలో ఈ నెల ఏడో తేదీ నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి. మూడు రంగులు – స్పార్కిల్ బ్లాక్, స్టారీ పర్పుల్, స్టార్ లైట్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. సెలెక్టెడ్ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేస్తే రూ.2,250తో నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ తోపాటు రూ.1350 వరకూ ఇన్ స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
ఒప్పో ఏ3ఎక్స్ 5జీ (Oppo A3X 5G) ఫోన్ 6.67 అంగుళాల హెచ్డీ+ (1604x 720 పిక్సెల్స్) ఎల్సీడీ స్క్రీన్ విత్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 240 టచ్ శాంప్లింగ్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ లెవల్, ట్వైస్ రీఇన్ ఫోర్స్డ్ పాండా గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. తడి చేతులతోనూ ఫోన్ వాడేందుకు స్ప్లాష్ టచ్ టెక్నాలజీ జత చేశారు.
ఒప్పో ఏ3ఎక్స్ 5జీ (Oppo A3X 5G) ఫోన్ ఒక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ ప్రాసెసర్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ కలర్ ఓఎస్ 14.0.1 వర్షన్ పై పని చేస్తుంది. 8-మెగా పిక్సెల్ మెయిన్ కెమెరాతోపాటు డ్యుయల్ రేర్ కెమెరా, 5-మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటాయి.
ఒప్పో ఏ3ఎక్స్ 5జీ (Oppo A3X 5G) ఫోన్ 45వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 5100 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీతో వస్తుంది. ఈ పోన్ 5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 5.3, జీపీఎస్, 3.5ఎంఎం ఆడియో జాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తోంది.