Oppo A3 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో (Oppo) తన ఒప్పో ఏ3 ప్రో (Oppo A3 Pro) ఫోన్‌ను శుక్రవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. గత ఏప్రిల్ నెలలో చైనాలో ఇదే ఫోన్ ను ఆవిష్కరించారు. భారత్ మార్కెట్లోకి వస్తున్న ఒప్పో ఏ3 ప్రో ఫోన్.. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 50-మెగా పిక్సెల్ డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఒప్పో ఏ3 ప్రో ఫోన్ 8జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.17,999, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.19,999 పలుకుతుంది. ఒప్పో ఇండియా ఆన్ లైన్ స్టోర్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తోపాటు దేశీయ రిటైల్ స్టోర్లలోనూ శుక్రవారం నుంచి సేల్స్ ప్రారంభం అయ్యాయి. ఒప్పో ఏ3 ప్రో పోన్ మూన్ లైట్ పర్పుల్, స్టారీ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది.హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఎస్బీఐ కార్డ్స్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్, యెస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు కార్డులపై కొనుగోలు చేసే వారికి 10 శాతం వరకూ ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. జీరో డౌన్ పేమెంట్, నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా లభిస్తాయి.
ఒప్పో ఏ3 ప్రో ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 180 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ తోపాటు 6.67 అంగుళాల స్క్రీన్ కలిగి ఉంటుంది. తడి చేతులతోనూ ఫోన్ ఉపయోగించేందుకు వీలుగా స్ప్లాష్ టచ్ ఫీచర్ జత చేశారు. మీడియాడెక్ డైమెన్సిటీ 6300 ఎస్వోసీ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్ విత్ 256 జీబీ ఆన్ బోర్డు స్టోరేజీ కెపాసిటీ ఉంటుంది. 8 జీబీ ర్యామ్ వర్చువల్‌గా 16 జీబీ ర్యామ్ వరకూ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ కలర్ ఓఎస్ 14 వర్షన్‌పై పని చేస్తుంది.
ఒప్పో ఏ3 ప్రో ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరాతోపాటు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి. నెట్ వర్క్ స్టెబిలిటీ కోసం ఏఐ లింక్ బూస్ట్ ఉంటుంది. 45వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతోపాటు 5100 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ కలిగి ఉంటుంది. డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ54 రేటింగ్ కలిగి ఉంటుంది.