Super Intelligent AI : సూపర్ ఇంటెలిజెంట్ ఏఐని నిర్మించడానికి ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడు ఇల్యా సట్స్కేవర్ కొత్త కంపెనీని ప్రారంభించారు. ఏఐ సేఫ్టీపై ఫోకస్ పెట్టే ఈ కంపెనీని సేఫ్ సూపర్‌ఇంటెలిజెన్స్ ఇన్క్ (ఎస్ఎస్ఐ)గా వ్యవహరిస్తారు.
ఏఐ సేఫ్టీ లక్ష్యంగా ఓపెన్ ఏఐ నుంచి బయటకు వచ్చిన అనంతరం సట్స్కేవర్ తన నూతన ప్రస్ధానాన్ని ప్రారంభించారు. యాపిల్ ఏఐ మాజీ లీడ్ డేనియల్ గ్రాస్, ఓపెన్ఏఐ మాజీ ఇంజనీర్ డేనియల్ లెవీతో కలిసి ఈ వెంచర్‌ను సట్స్కేవర్ చేపట్టారు. సురక్షిత, శక్తివంతమైన ఏఐ సిస్టమ్, మెరుగైన సామర్ధ్యాలతో కూడిన భద్రమైన ఏఐ వ్యవస్ధల కోసం ఈ కంపెనీ కృషి చేస్తుంది.
తాను నూతన కంపెనీని ఏర్పాటు చేస్తున్నానని ఎక్స్ వేదికగా సట్స్కేవర్ ప్రకటించారు. ఒకటే ఫోకస్, ఒకే లక్ష్యం, ఒకే ప్రోడక్ట్ నినాదంతో సేఫ్ సూపర్‌ఇంటెలిజెన్స్ ఆవిష్కరణకు నూతన కంపెనీ పనిచేస్తుందని మరో ట్వీట్లో ఆయన వెల్లడించారు. వాణిజ్య, నిర్వహణ డిమాండ్లను నెరవేరుస్తూనే వినూత్న పోకడలతో సూపర్ ఇంటెలిజెంట్ ఏఐ సిస్టమ్‌పై ఎస్ఎస్ఐ పనిచేస్తుంది.
Read More :