న్యూఢిల్లీ, డిసెంబర్ 5: చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్..భారత్‌లో వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి వచ్చే మూడేండ్లలో రూ.6 వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రకటించింది. ఇక నుంచి ప్రతియేటా రూ.2 వేల కోట్ల చొప్పున మూడేండ్లపాటు రూ.6 వేల కోట్లను ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి, సర్వీసింగ్‌ను మరింత బలోపేతం చేయడానికి ఖర్చు చేయనున్నట్లు కంపెనీ సీఈవో రోబిన్ లియూ తెలిపారు.
దేశీయ మార్కెట్లోకి మరిన్ని మాడళ్లను విడుదల చేయడానికి, కస్టమర్ సర్వీస్ సెంటర్లను, దేశీయ కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా మాడళ్లను తీర్చిదిద్దడానికి ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. వచ్చే రెండేండ్లలో సర్వీస్ సెంటర్లను 50 శాతం మేర పెంచబోతున్నట్లు ఆయన ప్రకటించారు.