One Plus Open | చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘వన్‌ప్లస్ (One Plus)’ భారత్‌తోపాటు గ్లోబల్ మార్కెట్లలో తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ‘వన్‌ప్లస్ ఓపెన్ (One Plus Open)’ ఆవిష్కరించింది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ఎస్వోసీతో వస్తున్నది. 16 జీబీ ర్యామ్ విత్ 512 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్ గా వస్తున్న ఈ ఫోన్ ధర రూ.1,39,999 పలుకుతుంది. ఎమరాల్డ్ డెస్క్, వైజర్ బ్లాక్ కలర్స్ లో లభిస్తుంది.
‘వన్ ప్లస్ ఓపెన్’ కోసం ఫ్రీ- ఆర్డర్లు ప్రారంభం అయ్యాయి. ఈ నెల 27 నుంచి సేల్స్ ప్రారంభం అవుతాయి. వన్‌ప్లస్ అఫిషియల్ వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్, అన్ని రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్ విక్రయిస్తారు. సెలెక్టెడ్ ఫోన్ల ఎక్స్చేంజ్ కింద రూ.8000 రాయితీ అందిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులు, వన్ కార్డ్ ద్వారా మరో రూ.5000 డిస్కౌంట్ లభిస్తుందని వన్ ప్లస్ తెలిపింది.
ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఆక్సిజన్ ఓఎస్ 13.2 వర్షన్‌పై పని చేస్తుందీ వన్ ప్లస్ ఓపెన్ స్మార్ట్ ఫోన్. ఇన్ సైడ్ 7.82 అంగుళాల (2,268×2440 పిక్సెల్స్) 2కే రిజొల్యూషన్, ఫ్లెక్సీ ఫ్లూయిడ్ ఎల్టీపీఓ 3.0 అమోలెడ్ డిస్ ప్లే, ఔటర్ స్క్రీన్ 6.31 అంగుళాల (1,116×2484 పిక్సెల్స్) 2కే రిజొల్యూషన్, ఎల్టీపీఓ 3.0 సూపర్ ఫ్లూయిడ్ అమోలెడ్ డిస్ ప్లే విత్ 10-120 డైనమిక్ రీఫ్రెష్ రేట్, 240 టచ్ శాంప్లింగ్ రేట్, 2800 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటుంది.
ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ కలిగి ఉంటుందీ వన్ ప్లస్ ఓపెన్. 48మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, 1/1.43 అంగుళాల సోనీ ఎల్వీటీ-టీ808 సీఎంఓఎస్ సెన్సర్, 64 మెగా పిక్సెల్ టెలిపోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలూ, వీడియో కాల్స్ కోసం ఇన్ సైడ్ స్క్రీన్ పై 20-మెగా పిక్సెల్, ఔటర్ స్క్రీన్ పై 32-మెగా పిక్సెల్ కెమెరా ఉన్నాయి.
5జీ, 4జీ ఎల్టీఈ, వై-ఫై 7, బ్లూటూత్ 5.3, జీపీఎస్, ఎన్ఎఫ్ సీ, యాక్సెలో మీటర్, గైరో స్కోప్, ప్రాగ్జిమిటీ సెన్సర్, సెన్సర్ కోర్, ఈ-కంపాస్, అండర్ స్క్రీన్ యాంబియెంట్ లైట్ సెన్సర్, 67 వాట్ల సూపర్ వూక్ చార్జింగ్ మద్దతుతో 4800 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది.