Amazon Prime Day | వచ్చేవారం నిర్వహించనున్న ‘అమెజాన్ ప్రైమ్ డే’ సందర్భంగా పలు మొబైల్ ఫోన్లపై డిస్కౌంట్లు, సేల్ ఆఫర్లు అందుబాటులోకి రానున్నాయి. దేశీయ మార్కెట్లోకి వచ్చిన వన్ ప్లస్ నార్డ్ 3 (OnePlus Nord 3), రియల్ మీ నార్జో 60 5జీ (Realme Narzo 60 5G), శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ (Samsung Galaxy M34 5G) ఫోన్లు, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులపై కొనుగోలు చేస్తే క్యాష్ బ్యాక్, డిస్కౌంట్ ఆఫర్లు లభిస్తున్నాయి.
ఈ నెల ఐదో తేదీన మార్కెట్లో రిలీజ్ కానున్నది వన్ప్లస్ నార్డ్3. దీంతోపాటు వన్ప్లస్ నార్డ్ సీఈ3, వన్ ప్లస్ బడ్స్ 2ఆర్ కూడా రిలీజ్ చేస్తారు. వన్ప్లస్ నార్డ్ 3 ఫోన్ మీడియా టెక్ డైమెన్సిటీ 9000, వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 782జీ చిప్సెట్తో వస్తున్నాయి.
ఈ నెల 6న రియల్ మీ నార్జో60 5జీ సిరీస్ ఫోన్లు మార్కెట్లోకి వస్తాయి. ఏడో తేదీన శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ సిరీస్ ఫోన్లు ఆవిష్కరిస్తారు. శాంసంగ్ గెలాక్సీ ఎం34 5జీ ఫోన్ 50మెగా పిక్సెల్స్ రేర్ కెమెరా విత్ సపోర్ట్ ఫర్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్), నైటోగ్రఫీ ఫీచర్ కోసం సపోర్ట్ గా ఉంటుంది. 6000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది.
ఐక్యూ నియో 7 ప్రో 5జీ, మోటరోలా రేజర్40 సిరీస్ ఫోన్లు ఆవిష్కరించారు. ఐక్యూ నియో 7 ప్రో ఫోన్లు ఈ నెల 15న అమెజాన్ ప్రైమ్ డే సందర్భంగా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.