పరేఖ్ వేతనం 21 శాతం కట్
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ వేతనంలో భారీగా కోత పడింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ఆయ న అందుకున్నది కేవలం రూ.56.44 కోట్లు మాత్రమే. అంతక్రితం ఏడాది అందుకున్న రూ.71 కోట్ల కంటే 21 శాతం తక్కువ కావడం విశేషం.
- 2022-23లో రూ.56 కోట్లు మాత్రమే
న్యూఢిల్లీ, జూన్ 3: దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ వేతనంలో భారీగా కోత పడింది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ఆయ న అందుకున్నది కేవలం రూ.56.44 కోట్లు మాత్రమే. అంతక్రితం ఏడాది అందుకున్న రూ.71 కోట్ల కంటే 21 శాతం తక్కువ కావడం విశేషం. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను కంపెనీ విడుదల చేసిన వార్షిక నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. స్టాక్ యూనిట్స్ ఆధారంగా వచ్చే రాబడి తగ్గుముఖం పట్టడం వల్లనే వేతనంలో కోత పడింది.
2019లో సంస్థ కొత్త మార్గదర్శకాలు జారీచేసింది. పనితీరు ఆధారంగా ప్రయోజనాలు పొందే అవకాశం కల్పించింది. ఇన్ఫోసిస్ ప్రెసిడెంట్ మోహిత్ జోషి అందుకున్న రూ.57.32 కోట్ల కంటే పరేఖ్ అందుకున్న వేతనం తక్కువగా ఉండటం విశేషం. మరోవైపు, తన పోటీ సంస్థ విప్రో సీఈవో థిర్రీ డెలాపోర్ట్ రూ.82.4 కోట్ల వార్షిక వేతనాన్ని అందుకున్నారు. థిర్రీ వేతనం కూడా 5 శాతం తగ్గింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను సలీల్ పరేఖ్ వేతనం కింద రూ.6.67 కోట్లు, పదవీ విరమణ తర్వాత పొందే ప్రయోజనాల కింద రూ.45 లక్షలు, వేరియబుల్ పే లేదా బోనస్ కింద రూ.18.73 కోట్లు లభించాయి. సాధారణ ఉద్యోగి అందుకున్న రూ.9 లక్షల కంటే 627 రెట్లు అధికంగా పరేఖ్ వేతనం పొందడం విశేషం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

