20న కళామందిర్ ఐపీవో రూ.600 కోట్ల సేకరణలో సంస్థ
ప్రముఖ దుస్తుల విక్రయ సంస్థ సాయి సిల్క్స్(కళామందిర్) స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కాబోతున్నది. ఈ నెల 20న ఐపీవోకి రాబోతున్నట్టు తాజాగా ప్రకటించింది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఈ నెల 18 బిడ్డింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపిన సంస్థ..ఈ ఐపీవో ద్వారా గరిష్ఠంగా రూ.600 కోట్ల నిధులను సమీకరించబోతున్నది.
హైదరాబాద్, సెప్టెంబర్ 13(బిజినెస్ బ్యూరో): ప్రముఖ దుస్తుల విక్రయ సంస్థ సాయి సిల్క్స్(కళామందిర్) స్టాక్ మార్కెట్లోకి లిస్ట్ కాబోతున్నది. ఈ నెల 20న ఐపీవోకి రాబోతున్నట్టు తాజాగా ప్రకటించింది. యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఈ నెల 18 బిడ్డింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపిన సంస్థ..ఈ ఐపీవో ద్వారా గరిష్ఠంగా రూ.600 కోట్ల నిధులను సమీకరించబోతున్నది. ఈ వాటా విక్రయంలో భాగంగా ప్రమోటర్లకు చెందిన 2.70కోట్ల ఈక్విటీ షేర్లను బహిరంగా మార్కెట్లో ఆఫర్ ఫర్ సేల్ రూట్లో విక్రయిస్తున్నది. ఇందుకు సంబంధించి షేరు ధరల శ్రేణిని మాత్రం సంస్థ ప్రకటించలేదు. ఈ నెల 20న ప్రారంభంకానున్న వాటా విక్రయం 22న ముగియనున్నది. గతంలో 1.80 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయించుదామనున్నకున్న సంస్థ..దీనిని 2.70 కోట్లకు పెంచింది.
120 కోట్లతో 30 నూతన స్టోర్లు..
కళామందిర్ తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే సంస్థకు తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుల్లో 54 స్టోర్లు ఉండగా..భవిష్యత్తులో కొత్తగా 30 స్టోర్లను ఏర్పాటు చేయబోతున్నది. ఇందుకోసం మూలధన వ్యయం కింద రూ.125 కోట్ల నిధులను వెచ్చించనున్నట్టు ప్రకటించింది. వీటితోపాటు రూ.25 కోట్లతో రెండు గిడ్డంగులను నెలకొల్పబోతున్నది. నిర్వహాణ మూలధనం కింద రూ.280 కోట్ల నిధులను చొప్పించనున్నట్టు ప్రకటించిన సంస్థ..మరో రూ.50 కోట్లను తిరిగి రుణాలు చెల్లించడానికి వెచ్చించబోతున్నది.
- ప్రస్తుతం సంస్థ కళామందిర్, వరమహాలక్ష్మీ సిల్క్స్, మందిర్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ పేర్లతో రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్నది. వీటిలో ప్రీమియం సాంప్రదాయ దుస్తులు, విలువ ఆధారిత ఉత్పత్తులను విక్రయిస్తున్నది.
- కంపెనీ షేర్లు త్వరలో బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్కాబోతున్నాయి.
- 2022-23 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.1,351 కోట్ల ఆదాయంపై రూ.97.6 కోట్ల నికర లాభాన్ని గడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- ipo
- Kalamandir
- stock market
RELATED ARTICLES
తాజా వార్తలు
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

