ముంబై, డిసెంబర్ 17: స్టాక్ మార్కెట్లను మరోసారి ఒమిక్రాన్ భయాలు చుట్టుముట్టాయి. మదుపరులు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి గురవడంతో శుక్రవారం అటు బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ), ఇటు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ భారీగా నష్టపోయాయి. బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 889.40 పాయింట్లు లేదా 1.54 శాతం కోల్పోయి 57,011.74 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ సైతం 263.20 పాయింట్లు లేదా 1.53 శాతం పడిపోయి 17వేల మార్కుకు దిగువన 16,985.20 వద్ద నిలిచింది. సెన్సెక్స్ షేర్లలో ఇండస్ఇండ్ బ్యాంక్ అత్యధికంగా 4.89 శాతం క్షీణించింది. కొటక్ బ్యాంక్, హెచ్‌యూఎల్, టైటాన్, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ షేర్లూ మదుపరులను ఆకట్టుకోలేకపోయాయి. సెన్సెక్స్‌లో కేవలం ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, పవర్‌గ్రిడ్, సన్ ఫార్మా, టీసీఎస్ షేర్లు లాభపడ్డాయి. రంగాలవారీగా రియల్టీ, బ్యాంకింగ్, ఎనర్జీ, ఫైనాన్స్, ఆటో, చమురు, గ్యాస్ సూచీలు 3.78 శాతం మేర దిగజారాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలూ 2.42 శాతం నష్టపోయాయి. ఇదిలావుంటే ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 1,774.93 పాయింట్లు లేదా 3.01 శాతం, నిఫ్టీ 526.10 పాయింట్లు లేదా 3 శాతం పతనమయ్యాయి.
కరిగిపోయిన 4.65 లక్షల కోట్లు
స్టాక్ మార్కెట్ల భారీ నష్టాల నేపథ్యంలో ఈ ఒక్కరోజే మదుపరుల సంపద లక్షలాది కోట్ల రూపాయల్లో హరించుకుపోయింది. బీఎస్ఈలో నమోదైన సంస్థల మార్కెట్ విలువ రూ.4,65,570.82 కోట్లు పడిపోయి రూ.2,59,37,277.66 కోట్లకు పరిమితమైంది. ఇటీవలికాలంలో కోలుకుంటున్న మార్కెట్లను కరోనా వైరస్ కొత్త రకం ఒమిక్రాన్ కుంగదీస్తున్నది.
నష్టాలకు కారణం ఇవే..