న్యూఢిల్లీ, సెప్టెంబర్ 16: ఓలా..మార్కెట్లోకి ప్రత్యేక ఎడిషన్‌గా రోడ్‌స్టర్ ఎక్స్+ మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 9.1 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఈ మాడల్ ధరను రూ. 1, 89,999గా నిర్ణయించింది. దీంతోపాటు 5.2 కిలోవాట్ల బ్యాటరీతో తయారైన ఎస్1 ప్రొ+ మాడల్‌ను రూ.1,69,999కి విక్రయించనున్నది.
ఈ రెండు వాహనాలు ఈ నవరాత్రి నుంచి డెలవరి చేయనున్నట్టు ప్రకటించింది. దీంతోపాటు స్పోర్ట్స్ స్కూటర్ విభాగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి నూతన ఎస్1 ప్రొ స్పోర్ట్ మాడల్‌ను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది.