Ola Prime Plus | దేశంలోనే అతిపెద్ద క్యాబ్స్ అగ్రిగేటర్ `ఓలా` తన `ప్రైమ్ ప్లస్` ప్రీమియం సర్వీస్‌ను హైదరాబాద్, పుణె, ముంబై నగరాలకు విస్తరించింది. బెంగళూరులో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ‘ప్రైమ్ ప్లస్’ ప్రీమియం సర్వీసులకు అనూహ్య స్పందన లభించింది. దీంతో మరో మూడు నగరాలకు ఈ సేవలు విస్తరించామని ఓలా తెలిపింది. గత మే 28న తొలుత బెంగళూరులో ఓలా ‘ప్రైమ్ ప్లస్’ సేవలు ప్రారంభించింది. ఈ సర్వీసుల్లో ప్రొఫెషనల్ డ్రైవర్లు అందుబాటులో ఉంటారు.
కస్టమర్లకు మెరుగైన సౌకర్యం, విశ్వసనీయత, సౌకర్యం కల్పించడానికి తద్వారా వారిలో గణనీయంగా సంతృప్తి పెంచడానికి ప్రైమ్ ప్లస్ సర్వీస్ ప్రారంభించినట్లు ఓలా తెలిపింది. హైదరాబాద్, ముంబై, పుణె నగరాల్లో తొలుత సెలెక్టెడ్ కస్టమర్లకు ప్రైమ్ ప్లస్ సేవలు అందిస్తారు. తదుపరి దశలో అందరికీ అందుబాటులోకి తెస్తుంది. 2011లో ఓలా క్యాబ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం 200 నగరాల్లో పది లక్షల మందికి పైగా డ్రైవర్లతో ఓలా క్యాబ్ సేవలు అందిస్తున్నది.