న్యూఢిల్లీ : పెట్రో ధరల షాక్‌తో వాహనదారులు ప్రత్యామ్నాయాల వైపు దృష్టిసారిస్తున్న సమయంలో ఓలా ఎలక్ట్రిక్ భారత్ మార్కెట్లోకి ఆగస్ట్ 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా తన న్యూ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంఛ్ చేస్తోంది. ఈ వాహనానికి కంపెనీ ఇప్పటికే ప్రీ బుకింగ్స్ ప్రారంభించగా లక్ష మందికి పైగా ఈ స్కూటర్‌ను బుక్ చేసుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ సహ వ్యవస్ధాపకుడు, సీఈఓ భవీష్ అగర్వాల్ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంఛ్ వివరాలను ట్విటర్లో పోస్ట్ చేశారు.
కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఈ ఎలక్ట్రిక్ వాహనం పది రంగుల్లో కనువిందు చేయనుంది. ఇప్పటికే టీజర్ల ద్వారా కొన్ని ఫీచర్లను వెల్లడించగా సీటు కింద భారీ స్టోరేజ్‌తో పాటు ఎల్ఈడీ డీఆర్ఎల్ రింగ్‌తో ట్విన్ పాడ్ హెడ్‌లైట్, కర్వీ డిజైన్, స్లీక్ ఎల్ఈడీ టెయిల్‌లైట్, వెనుక భాగంలో చార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లతో అలరించనుంది.
లాంఛ్ సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ తన బైక్ గురించి పూర్తి స్సెసిఫికేషన్స్, వేరియంట్లు, ధరలు, ఇతర వివరాలను వెల్లడించనుంది. ఇక ఓలా స్కూటర్‌కి ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే దాదాపు 150 కి.మీ దాకా మైలేజ్ రానుంది. ఈ స్కూటర్‌ను 0 నుండి 50% వరకు ఛార్జ్ంగ్ని జస్ట్ 18 నిమిషాల్లోనే ఛార్జ్ చేయవచ్చు. ఈ ఛార్జింగుతోనే 75 కి.మీ. ప్రయాణించే వెసులుబాటు ఉంది.