Ola Electric IPO | ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు సెబీ’ ఓకే..
Ola Electric IPO | బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ప్రముఖ ఈవీ స్టార్టప్ ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ అప్లికేషన్‌కు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ ఆమోదం లభించిందని సమాచారం.
Ola Electric IPO | బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ప్రముఖ ఈవీ స్టార్టప్ ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ అప్లికేషన్‌కు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ ఆమోదం లభించిందని సమాచారం. దేశంలో ఐపీఓకు వెళుతున్న తొలి ఈవీ స్టార్టప్ గా ఓలా ఎలక్ట్రిక్ నిలిచింది. త్వరలో ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓకు అనుమతినిస్తూ అధికారికంగా సెబీ ఓ ప్రకటన చేస్తుందని సమాచారం. ఈ సంగతిని ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ కొందరు సన్నిహిత ఉద్యోగులకు చెప్పినట్లు తెలుస్తోంది. బహిరంగ మార్కెట్ నుంచి నిధుల సేకరణకు గతేడాది డిసెంబర్ 22న సెబీకి ఓలా డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్‌హెచ్‌పీ) దాఖలు చేసింది. ఐపీఓ ద్వారా కొత్త షేర్లు విడుదల చేసి రూ.5,500 కోట్ల నిధులు సేకరించాలని ఓలా ఎలక్ట్రిక్ ప్రణాళిక రూపొందించుకున్నది. అదనంగా ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద 95.2 మిలియన్ల షేర్లను ఐపీఓ ద్వారా మార్కెట్లో లిస్టింగ్ చేయాలని భావిస్తున్నది. ఓలా ఎలక్ట్రిక్ బ్యాంకర్లు తెలిపిన వివరాల ప్రకారం ఐపీఓ ద్వారా తన కంపెనీ విలువ 600 కోట్ల డాలర్లకు పెంచుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

