కృష్ణగిరి(తమిళనాడు), ఆగస్టు 15: ప్రముఖ ఈవీ స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో అరుదైన ఖనిజాల కొరత తీవ్రతరమవుతున్న ప్రస్తుత తరుణంలో ఓలా ఎలక్ట్రిక్ ఏకంగా స్వదేశీ సెల్‌ను తయారు చేసేయోచనలో ఉన్నది.
ఈ విషయాన్ని కంపెనీ ఫౌండర్, సీఈవో భవిష్ అగర్వాల్ తెలిపారు. భారత్ సెల్‌తోపాటు కృత్రిమ మేధస్సు కలిగిన మూవ్ ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు.