న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ప్రముఖ విద్యుత్ వాహన సంస్థ ఓలా మరోసారి నిధులను సేకరించడానికి సిద్ధమైంది. రూ.1,500 కోట్ల నిధుల సేకరణకు కంపెనీ బోర్డు శనివారం సమావేశమైన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. షేర్లను జారీ చేయడం లేదా కన్వర్టబుల్ సెక్యూరిటీలను జారీ చేయడం ద్వారా ఈ నిధుల సేకరించాలని కంపెనీ యోచిస్తున్నది.