Crude Oil | పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చమురు ధరలు పెరుగుతున్నాయి. బ్రెండ్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 75 డాలర్ల మార్క్‌ను దాటింది. బెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ సైతం 72 డాలర్లకు చేరింది. వాస్తవానికి ఇటీవల క్రూడ్ ఆయిల్ ధరలు పతనమయ్యాయి. ఈ క్రమంలోనే భారత్‌లో చమురు ధరలు తగ్గే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్ మిసైల్స్‌తో విరుచుకుపడింది. ప్రస్తుతం రెండు దేశాల మధ్య యుద్ధ భయాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆయిల్ సరఫరాపై పెను ప్రభావం చూపే అవకాశం ఉన్నది. ఈ క్రమంలోనే ధరలు పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌కు 75 డాలర్లకు చేరింది. గత రెండుమూడు రోజుల్లో చమురు ధరలు 5శాతం వరకు పెరిగాయి. ఇరాన్ రోజుకు 1.5 మిలియన్ బ్యారెల్స్ ఉత్పత్తి చేస్తున్నది.
ఇజ్రాయెల్ దాడులకు తెగబడితే ఇంధన ఉత్పత్తిపై భారీగా ప్రభావం పడే అవకాశం ఉందని సిటీ గ్రూప్ ఇంక్ నివేదిక పేర్కొంది. వాస్తవానికి క్రూడాయిల్ ధర హెచ్చుతగ్గులకు లోనవుతుంది. సెప్టెంబర్ 27న సైతం ధర పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లో కూడ్రాయిల్ ధరల పెరుగుదలతో భారత్‌లో చమురు ధరలు పెరుగుతాయా? అన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. అయితే, ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధరలు ఎలా ఉంటాయో కొంత కాలం వేచి చూడాల్సిందేనని హెచ్‌పీసీఎల్ మాజీ సీఎండీ ఎంకే సురానా పేర్కొన్నారు. చమురు కంపెనీలపై ఒత్తిడి గణనీయంగానే ఉందని.. ధరల తగ్గింపుపై తీసుకునే ముందు పరిస్థితులు గమనించడం ముఖ్యమన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మొన్నటి వరకు భారీగా పడిపోయాయి. ఈ క్రమంలో దాంతో ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్‌పై భారీగానే ఆదాయాన్ని పొందాయి. ఈ క్రమంలోనే త్వరలోనే లీటర్‌కు రూ.3 నుంచి రూ.4 వరకు తగ్గించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. యుద్ధ భయం నేపథ్యంలో ధరలు పెరుగుతాయా? లేక తగ్గుతాయా? అన్నదానిపై వేచి చూడాల్సిందే.