Crude Oil | టర్కీలో రష్యా-ఉక్రెయిన్ మధ్య జరిగిన శాంతి చర్చల్లో అర్ధవంతమైన పురోగతి కనిపించడంతో ముడి చమురు ధరలు కాస్త యూ-టర్న్ తీసుకున్నాయి. మంగళవారం ఒక్కరోజే ఆరు శాతం తగ్గి బ్యారెల్ ముడి చమురు ధర 106 డాలర్లకు పడిపోయింది.
బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ ధర ఆరు శాతానికి పైగా తగ్గి సుమారు 106 డాలర్లకు చేరుకోగా, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ (డబ్ల్యూటీఐ) క్రూడ్ బ్యారెల్ ధర కూడా 6 శాతానికి పైగా పతనమై 99.6 డాలర్లకు పడిపోయింది.
ఉక్రెయిన్ ప్రతినిధి డేవిడ్ అరఖామియా మాట్లాడుతూ.. నాయకుల స్థాయిలో సమావేశాల కోసం ఈ రోజు జరిగిన శాంతి చర్చల్లో సత్ఫలితాలను సాధించాం అని చెప్పారు. ఉక్రెయిన్ ప్రతినిధులతో జరిగిన శాంతి చర్చల్లో అర్ధవంతమైన పురోగతి సాధించడాన్ని రష్యా ప్రతినిధి స్వాగతించారు.