న్యూయార్క్ : మాస్ లేఆఫ్స్, హైరింగ్ నిలిపివేత, వ్యయ నియంత్రణ చర్యల వంటి క్లిష్ట పరిస్ధితులను, చేదు అనుభవాలను చవిచూసిన మెటా ఉద్యోగులు (Meta) మళ్లీ హ్యాపీ మూడ్‌లోకి వచ్చారు. ఆఫీస్ స్నాక్స్, హ్యాపీ అవర్స్, ఫ్రీబీస్ వంటి మహమ్మారికి ముందున్న సౌకర్యాలు ఉద్యోగుల ముంగిటకు వస్తుండటంతో టెకీలు ఖుషీగా ఉన్నారు.
నిన్నమొన్నటి వరకూ ఎడాపెడా కొలువుల కోతను చూసిన టెకీలు ఇప్పుడిప్పుడే బ్రాండెడ్ టీ షర్ట్లు, డిలైట్‌ఫుల్ హ్యాపీ అవర్స్ మళ్లీ ముందుకొస్తుండటంతో చీకటి రోజులు ముగిసిపోయాయని మురిసిపోతున్నారు. ఎందరో కొలీగ్స్‌ను కోల్పోయి వర్క్‌ప్లేస్ పెర్క్‌లను మరిచిపోయిన మెటా ఉద్యోగులు ఖుషీ కబురుతో పండుగ చేసుకుంటున్నారు. ఇన్స్టాగ్రాం, వాట్సాప్, మెసెంజర్ పేరెంట్ కంపెనీ మెటా తిరిగి ఉద్యోగులకు బ్రాండెడ్ ఐటెమ్స్‌ను అందిస్తుండటం కంపెనీ సామర్ధ్యానికి సానుకూల సంకేతంగా భావిస్తున్నారు.
వరుసగా రెండు క్వార్ట్సర్స్లో కంపెనీ లాభాలు, రాబడి వాల్‌స్ట్రీట్ అంచనాలను మించడంతో ఉద్యోగులకు మళ్లీ ఫ్రీబీస్ అందుబాటులోకి తీసుకువచ్చారు. మరోవైపు గతంలో తొలగించిన ఉద్యోగుల్లో కొందరిని మెటా తిరిగి విధుల్లోకి తీసుకోవడం ప్రారంభం కావడంతో మళ్లీ మంచిరోజులు వచ్చాయని టెకీలు ఊరట చెందుతున్నారు.
కాలిఫోర్నియా మెన్లో పార్క్‌లోని మెటా ప్రధాన కార్యాలయంలో కరోనా సమయంలో మూసివేసిన పలు రెస్టారెంట్లలో చాలా రెస్టారెంట్లు తిరిగి ఓపెన్ అయ్యాయి. లాండ్రీ సేవలు, హెయిర్ కట్స్ యధావిధిగా అందుబాటులోకి వచ్చాయి. రిటన్ టూ ఆఫీస్ పాలసీలో భాగంగా ఈ పెర్క్స్ తిరిగి ప్రవేశపెట్టామని, డిన్నర్, హ్యాపీ హవర్ వంటివి కరోనా, బడ్జెట్ నియంత్రణల వల్ల సర్దుబాటు చేశామని, వీటిని ఎన్నడూ పూర్తిగా నిలిపివేయలేదని మెటా ప్రతినిధి ధ్రువీకరించారు.
Read More :