హైదరాబాద్, ఫిబ్రవరి 27: న్యూమోరస్.. మార్కెట్లోకి మరో ఈ-స్కూటర్ ‘డిప్లోస్ మ్యాక్స్’ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండు రకాల్లో లభించనున్న ఈ స్కూటర్ ధర రూ.1,12,199గా నిర్ణయించింది.
3.7 కిలోవాట్ల రెండు బ్యాటరీలతో తయారైన ఈ స్కూటర్ పూర్తిగా రీచార్జితో 140 కిలోమీటర్లు, అలాగే గంటకు 63 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్నట్లు కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సౌందరరాజన్ ఈ సందర్భంగా తెలిపారు.