గతవారం ర్యాలీ జరిపిన ఎన్ఎస్ఈ నిఫ్టీ 20,000 సమీపం నుంచి వెనుతిరిగి, చివరకు 19,745 వద్ద నిలిచింది. వీకెండ్లో వచ్చిన రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్ ఫలితాలు ఈ సోమవారం హెచ్చుతగ్గులకు గురిచేస్తాయని, అటుతర్వాత జూలై 26న యూఎస్ ఫెడ్ మీటింగ్, 27న జూలై డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు ఉన్నందున సూచీలు పరిమితశ్రేణిలో ఒడిదుడుకులకు లోనవుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
సమీప మద్దతు 19,610
ఈ వారం నిఫ్టీకి 19,610 సమీపంలో మద్దతు ఉందని, ఇది కోల్పోతే 19,470 వద్ద తదుపరి మద్దతు లభిస్తున్నదని ఈక్విటీ రీసెర్చ్ ఆసియా వ్యవస్థాపకుడు మిలన్ వైష్ణవ్ అంచనా వేశారు. 19,850, 20,000 స్థాయిలు నిరోధాలు ఉన్నాయన్నారు. నిఫ్టీకి 20,000 స్థాయి అవరోధంకాగా, 19,700, 19,500 స్థాయిలు మద్దతు అందించవచ్చని సామ్కో సెక్యూరిటీస్ సీఈవో జిమిత్ మోది అంచనా వేశారు.