NSE Co-location Scam | ఎన్ఎస్ఈ కొ-లొకేషన్ స్కాం కేసులో ఆ సంస్థ మాజీ ఎండీ చిత్ర రామకృష్ణ బెయిల్ పిటిషన్పై రెండు వారాల్లో స్పందన తెలపాలని సీబీఐని ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రత్యేక జడ్జి సంజీవ్ అగర్వాల్ ప్రకటించారు. ఈ కేసులో తనను తదుపరి విచారించాల్సిన అవసరం లేదని, కనక బెయిల్ మంజూరు చేయాలని చిత్ర రామకృష్ణ శుక్రవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం విధించే అన్ని షరతులను పాటించడానికి సిద్ధం అని ఆ పిటిషన్లో తెలిపారు.
గతవారం చిత్ర రామకృష్ణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం తిరస్కరించిన తర్వాత సీబీఐ ఆమెను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఎన్ఎస్ఈ మాజీ గ్రూప్ ఆరేటింగ్ ఆఫీసర్గా పని చేసిన ఆనంద్ సుబ్రమణ్యన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించిన సంగతి తెలిసిందే.