ఉద్యోగ పదవీ విరమణ అనంతర ప్రణాళికపట్ల చాలామంది ఆసక్తి కనబర్చరు. అయితే గత ఏడాది నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్), ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) సబ్‌స్ర్కైబర్లకు ఓ టర్నింగ్ పాయింటే. ఉపసంహరణలు, కష్టమైన పేపర్ వర్క్ ప్రక్రియ, పెట్టుబడులపై పరిమిత స్వేచ్ఛ వంటి సుదీర్ఘ కాలం నుంచి వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం దొరికింది మరి. మొత్తానికి ఇప్పుడు రిటైర్మెంట్ వ్యవస్థ చాలా ద్రవ్యపరమైనదిగా, సాంకేతికంగా అయ్యింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
పూర్తి ఆటోమేటెడ్, సెల్ఫ్-సర్వీస్ మాడల్‌గా ఈపీఎఫ్‌వో తయారవుతున్నది. రూ.5 లక్షలదాకా ఉన్న క్లెయిమ్‌లు మాన్యువల్ ప్రాసెసింగ్ లేకుండానే ఆటోమేటిగ్గా డిజిటల్ విధానంలోనే సెటిల్మెంట్ అవుతున్నాయి. అలాగే సబ్‌స్ర్కైబర్ల భద్రత, సౌకర్యార్థం ఉమాంగ్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్‌ను పరిచయం చేశారు.