ఇక ఫీచర్ ఫోన్లలోనూ యూపీఐ.. ఇంటర్నెట్తో పనిలేకుండా ‘ఫోన్‌పే యూపీఐ 123పే’ సేవలు
ఇకపై ఫీచర్ ఫోన్ వినియోగదారులూ యూపీఐని వినియోగించుకోనున్నారు. ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్‌పే.. సోమవారం ‘ఫోన్‌పే యూపీఐ 123పే’ సేవలను ప్రారంభించింది. దీనివల్ల ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే ఫీచర్ ఫోన్ యూజర్లకూ యూపీఐ లావాదేవీలను జరిపే వెసులుబాటు దక్కింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 31: ఇకపై ఫీచర్ ఫోన్ వినియోగదారులూ యూపీఐని వినియోగించుకోనున్నారు. ఫిన్‌టెక్ దిగ్గజం ఫోన్‌పే.. సోమవారం ‘ఫోన్‌పే యూపీఐ 123పే’ సేవలను ప్రారంభించింది. దీనివల్ల ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే ఫీచర్ ఫోన్ యూజర్లకూ యూపీఐ లావాదేవీలను జరిపే వెసులుబాటు దక్కింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 20 కోట్లకుపైగానే ఫీచర్ ఫోన్ వినియోగదారులున్నట్టు అంచనా. అయితే స్మార్ట్‌ఫోన్ యూజర్లకున్నట్టు ఇంటర్నెట్ సదుపాయం లేకపోవడంతో వీరంతా యూపీఐ లావాదేవీలకు దూరమవుతున్నారు. కానీ ఇప్పుడు వీరు కూడా ఫోన్‌పే యూపీఐ 123పే ద్వారా ఇకపై యూపీఐ లావాదేవీలను జరుపుకోవచ్చని, ఈ తరహా సౌకర్యాన్ని అందిస్తున్న తొలి ప్రముఖ థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (టీపీఏపీ) తామేనని ఫోన్‌పే ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
అన్ని ఫోన్లలో కాదు..
ఇప్పటికైతే నోకియా, హెచ్ఎండీ, లావా ఇంటర్నేషనల్, ఐటెల్ మొబైల్ కంపెనీలకు చెందిన ఫీచర్ ఫోన్ వినియోగదారులు మాత్రమే ఫోన్‌పే యూపీఐ 123పే సేవల్ని పొందవచ్చు. ఈ ఫోన్లలో ప్రీ-బండిల్డ్‌గా ఫోన్‌పే యూపీఐ 123పే ఉంటుంది. అయితే మరిన్ని మొబైల్ ఫోన్లలోనూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకొనేలా ప్రయత్నిస్తున్నామని ఫోన్‌పే చెప్తున్నది. ఇదిలావుంటే కొత్తగా ఫీచర్ ఫోన్ కొనేవారికే ఈ ఫోన్‌పే యూపీఐ 123పే సేవలు అందుబాటులో ఉంటాయా? లేదా ఇప్పటికే సదరు ఫోన్లను వాడుతున్నవారూ పొందవచ్చా? అన్నదానిపై మాత్రం స్పష్టత లేదు. ఇక ఇదో ఎస్ఎంఎస్ ఆధారిత యూపీఐ నిర్మాణం. 2జీ కనెక్టివిటీ పరిమితంగా ఉన్న ప్రాంతాల్లోనూ పనిచేస్తుంది. మొబైల్ నెంబర్ లేదా యూపీఐ ఐడీ, క్యూఆర్ కోడ్లను వినియోగించి పర్సన్-టు-పర్సన్, పర్సన్-టు-మర్చంట్ పేమెంట్స్నూ చేసుకోవచ్చు. బ్యాంక్ ఖాతాలో ఎంత నగదు ఉన్నది? గతంలో జరిపిన లావాదేవీల చరిత్రనూ చూసుకోవచ్చు. మున్ముందు బిల్ పేమెంట్స్, మొబైల్ రీచార్జెస్, ఆధార్ ఆధారిత ఆన్‌బోర్డింగ్ సేవల్నీ తెస్తామని ఫోన్‌పే చెప్తున్నది.
ఏఐ ఆధారిత హెల్ప్‌లైన్
ఫీచర్ ఫోన్ వినియోగదారులు ఫోన్‌పే యూపీఐ 123పే సేవల్ని వినియోగించుకోవడానికి వీలుగా ఫోన్‌పే ఓ వాయిస్-ఫస్ట్, ఏఐ ఆధారిత హెల్ప్‌లైన్‌నూ ప్రారంభించింది. స్టెప్-బై-స్టెప్ గైడెన్స్ తీసుకోవచ్చని, యూపీఐ సంబంధిత ప్రశ్నలకూ సమాధానాలు పొందవచ్చని, ఇంగ్లిష్‌తోపాటు 12 స్థానిక భాషల్లోనూ యూజర్లు సాయం అందుకోవచ్చని ఫోన్‌పే తెలిపింది. కాగా, ఈ ఏడాది జూలైనాటికి ఫోన్‌పే వినియోగదారులు 71.5 కోట్లపైనే. అలాగే 5 కోట్లకుపైగా వ్యాపార భాగస్వాములున్నారని ఫోన్‌పే చెప్తున్నది.
నమోదు ఇలా..
- ఫీచర్ ఫోన్పైనున్న ప్రీ-ఇన్స్టాల్డ్ ఫోన్‌పే యాప్‌ను తెరువాలి.
- ఆ తర్వాత అక్కడున్న సమాచారాన్ని చదివి, నిబంధనలు-షరతుల్ని అంగీకరిస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
- అనంతరం కనిపించే జాబితాలో వినియోగదారులు తమకు ఖాతా ఉన్న బ్యాంక్‌ను ఎంచుకోవాలి.
- తమ డెబిట్ కార్డ్ చివరి ఆరు అంకెలు, కార్డ్ గడువు (ఎక్స్పైరీ) తేదీని కూడా ఎంటర్ చేయాలి.
- ఆపై యూపీఐ పిన్ నెంబర్‌ను సెట్ చేసుకోవాలి.
- ఒక్కసారి యూపీఐ పిన్ నెంబర్ సెట్ అయితే.. యూపీఐ ఐడీ యాక్టివ్ అవుతుంది. యూజర్లు ఫోన్‌పే యూపీఐ 123పే ద్వారా చెల్లింపులను చేసుకోవచ్చు.
చెల్లింపులు ఇలా..
- ఫోన్‌పే యాప్‌ను తెరువాలి.
- ‘పే టు మొబైల్ నెంబర్ లేదా పే టు యూపీఐ ఐడీని ఎంచుకోవాలి.
- ఎవరికైతే నగదు పంపాలో వారి మొబైల్ నెంబర్ లేదా యూపీఐ ఐడీని ఎంటర్ చేయాలి.
- చెల్లింపులకు సంబంధించి అన్ని వివరాలను చెక్ చేసుకోవాలి.
- ఎంతైతే నగదు పంపాలో ఆ మొత్తాన్ని ఎంటర్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. ఆపై ‘ఓకే’ నొక్కాలి.
- తర్వాత వచ్చే స్క్రీన్‌లో పేమెంట్ విజయవంతంగా పూర్తయ్యిందో లేదో తెలియపరుస్తుంది.
- కెమెరా సదుపాయం ఉన్న ఫీచర్ ఫోన్ యూజర్లు స్కాన్ అండ్ పే ఆప్షన్‌నూ ఎంచుకొని క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి చెల్లింపులు జరుపవచ్చు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Phone Pay
- Phone Pay users
- TPAP
- upi
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

