హనుమకొండ, అక్టోబర్ 28 : నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్పీడీసీఎల్)కు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన రెండు ఐఎస్వో సర్టిఫికెట్లు లభించాయి. మంగళవారం మధిరలో జరిగిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార ఈ సర్టిఫికెట్లను ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్రెడ్డికి అందజేశారు.
ఈ సందర్భంగా వరణ్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ పంపిణీ కార్యకలాపాలు, సబ్ స్టేషన్ల నిర్వహణ, నిర్మాణ పనుల్లో ప్రదర్శించిన నాణ్యతకు గుర్తింపుగా ఐఎస్వో 9001:2015 క్వాలిటీ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికెట్లు అందించారన్నారు.