మంగళవారం 09 మార్చి 2021
Business - Dec 01, 2020 , 02:43:00

వంట గ్యాస్‌పై సబ్సిడీకి మంగళం?

వంట గ్యాస్‌పై సబ్సిడీకి మంగళం?

దేశంలోని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రతి నెలా ఒకటో తేదీన వంట గ్యాస్‌ (ఎల్పీజీ) ధరను సవరించే ప్రక్రియ చాలా కాలం నుంచి కొనసాగుతున్నది. ఇదేవిధంగా డిసెంబర్‌ 1న మరోసారి ఎల్‌పీజీ ధరను సవరించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత కొవిడ్‌-19 సంక్షోభ సమయంలో వంట గ్యాస్‌ ధరలు పెద్దగా మారకపోయినప్పటికీ పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మాత్రం గత కొన్ని రోజుల నుంచి మళ్లీ వేగంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు గృహావసరాలకు రాయితీతో అందించే ఎల్పీజీ సిలిండర్లపై గత నాలుగు నెలల నుంచి వినియోగదారుల ఖాతాల్లో సబ్సిడీ సొమ్ము జమ కావడంలేదు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయంగా ముడి చమురు, గ్యాస్‌ ధరలు తగ్గినప్పటికీ గృహ వినియోగ వంట గ్యాస్‌పై సబ్సిడీని ఎత్తివేసేందుకు మోదీ సర్కార్‌ పావులు కదుపుతున్నది. దీనిపై ఏ క్షణంలోనైనా నిర్ణయం జరుగవచ్చు.


VIDEOS

logo