LPG eKYC | వంట గ్యాస్ సిలిండర్ల వినియోగదారుల ఈ-కేవైసీ ప్రక్రియకు ఎటువంటి తుది గడువు లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పష్టం చేశారు. 2023లోనే ఎల్పీజీ ఈ-కేవైసీ ప్రక్రియ చేపట్టాలని కేంద్ర చమురు సంస్థలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. తదనుగుణంగా గ్యాస్ ఏజెన్సీలు తమ కస్టమర్ల ఈ-కేవైసీ ప్రక్రియ మొదలు పెట్టాయి. గ్యాస్ ఏజెన్సీల వద్దే ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని కొన్ని సంస్థలు పట్టుబట్టడంతో వంట గ్యాస్ వినియోగదారులు ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీకి కేరళ అసెంబ్లీలో విపక్ష నేత వీడీ సతీశన్ లేఖ రాశారు. సతీశన్ లేఖపై ప్రతి స్పందించిన హర్దీప్ సింగ్ పూరీ.. ఎల్పీజీ ఏజెన్సీ సంస్థల్లోనే తప్పనిసరిగా ఈ-కేవైసీ ప్రక్రియ పూర్తిచేయాలన్న నిబంధన లేదని స్పష్టం చేశారు. కేంద్ర చమురు సంస్థలు తమ వినియోగదారులకు ఎటువంటి అసౌకర్యాన్ని కలిగించబోవని పేర్కొన్నారు.
‘బోగస్ కస్టమర్ల తొలగింపునకు కేంద్ర ప్రభుత్వ చమురు సంస్థలు గత ఎనిమిది నెలలుగా ఈ-కేవైసీ ఆధార్ అథంటికేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నాయి. వంట గ్యాస్ సిలిండర్ల డెలివరీ సమయంలోనే సంబంధిత గ్యాస్ ఏజెన్సీ డెలివరీ సిబ్బంది కస్టమర్ల వివరాలు ధృవీకరిస్తారు. డెలివరీ సిబ్బంది తమ వద్ద ఉన్న మొబైల్ ఫోన్లలోని యాప్ సాయంతో కస్టమర్ల ఆధార్ వివరాలను నమోదు చేసుకుని ఈ ప్రక్రియ పూర్తి చేస్తారు. కస్టమర్లు తమ సౌలభ్యానికి అనుగునంగా సమీపంలోని డిస్ట్రిబ్యూటర్ షోరూమ్ కు వెళ్లి కూడా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయొచ్చు. అలాగే కేంద్ర చమురు సంస్థల యాప్లు ఇన్ స్టాల్ చేసుకుని సొంతంగా ఈ-కేవైసీ అప్ డేట్ చేయొచ్చు’ అని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ తెలిపారు.
Vivo | వివో నుంచి మరో రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లు.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
New EV Policy | కొత్త ఈవీ పాలసీ’లో మార్పులు.. దేశీయ కంపెనీలకే బెనిఫిట్లు.. ఎందుకంటే..?!
Tomato | మండే బ్లూస్ మాదిరిగా టమాటా కష్టాలు.. సెంచరీకి చేరువలో కిలో..!