న్యూఢిల్లీ, అక్టోబర్ 22: ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వరంగ సంస్థ ఎన్ఎండీసీ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. టన్ను ఖనిజ ధరను రూ.550 వరకు తగ్గించినట్టు ప్రకటించింది. దీంతో లంప్సం టన్ను ధర రూ.550 తగ్గడంతో రూ.5,550కి దిగిరాగా, నాణ్యమైన ఖనిజ రకం ధరను కూడా రూ.500 కోత పెట్టడంతో రూ.4,750కి దిగొచ్చింది. తగ్గిన ధరలు వెంటనే అమలులోకి వచ్చాయని కంపెనీ బీఎస్ఈకి సమాచారం అందించింది. ఆగస్టు 1న ధరలను సమీక్షించిన సంస్థ..మళ్లీ రెండు నెలల తర్వాత తగ్గించడం విశేషం. దీంతో స్టీల్ తయారీదారులకు భారీ ఊరట లభించినట్టు అయింది.