న్యూఢిల్లీ, ఆగస్టు 1: దేశంలో అతిపెద్ద ఇనుప ఖనిజ సంస్థ ఎన్ఎండీసీ ఉత్పత్తి 11 శాతం పడిపోయింది. గత నెలకుగాను 2.17 మిలియన్ టన్నుల ఖనిజాన్ని మాత్రమే ఉత్పత్తి చేసింది. అంతక్రితం ఏడాది 2.44 మిలియన్ టన్నుల.
అలాగే ఖనిజ అమ్మకాలు 2.91 మిలియన్ టన్నుల నుంచి 3.06 మిలియన్ టన్నులకు పెరిగింది. అలాగే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూలై మధ్యకాలంలో 11.36 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేయగా, 13.15 మిలియన్ టన్నుల ఖనిజాన్ని విక్రయించింది.