హైదరాబాద్, అక్టోబర్ 29: ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన ఎన్ఎండీసీ నష్టాలను తగ్గించుకున్నది. సెప్టెంబర్ త్రైమాసికానికిగాను సంస్థ రూ.114.78 కోట్ల నష్టం వచ్చినట్టు తెలిపింది.
సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.1,535.46 కోట్ల నుంచి రూ.3,411.03 కోట్లకు పెరిగినప్పటికీ నష్టాలు రావడం విశేషం. అలాగే నిర్వహణ ఖర్చులు కూడా రూ.3,593 కోట్లకు పెరగడం వల్లనే లాభాల్లో గండిపడిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.