ఎన్ఎండీసీ రూ.5.73 డివిడెండ్
దేశంలో అతిపెద్ద ఖనిజ ఉత్పత్తి సంస్థ ఎన్ఎండీసీ మరోమారు మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.5.73 (573 శాతం) మధ్యంతర డివిడెండ్‌ను ప్రతిపాదించింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 8: దేశంలో అతిపెద్ద ఖనిజ ఉత్పత్తి సంస్థ ఎన్ఎండీసీ మరోమారు మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.5.73 (573 శాతం) మధ్యంతర డివిడెండ్‌ను ప్రతిపాదించింది. ఈ ఏడాది ప్రకటించడం ఇది రెండోసారి. గతంలో రూ.9.01 డివిడెండ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ ఏడాది ఒక్కో షేరుకు రూ.14.74 డివిడెండ్ చెల్లించినట్లు అయింది.
క్యూ3లో రూ.2,048 కోట్ల లాభం
నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది సంస్థ. నిర్వహణ ఖర్చులు అధికమవడంతో గత త్రైమాసికానికిగాను కన్సాలిడేటెడ్ నికర లాభం 2.8 శాతం తగ్గి రూ.2,048.40 కోట్లకు తగ్గినట్లు పేర్కొంది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.2,108.05 కోట్ల లాభాన్ని గడించింది. కానీ, కంపెనీ ఆదాయం రూ.4,460.97 కోట్ల నుంచి రూ.6,026.68 కోట్లకు పెరిగినట్లు తెలిపింది. నిర్వహణ ఖర్చులు రూ.1,650.56 కోట్ల నుంచి రెండు రెట్లు పెరిగి రూ.3,332.44 కోట్లకు చేరుకోవడం వల్లనే లాభాల్లో ప్రతికూల వృద్ధి నమోదైంది. ఇబ్బందికర పరిస్థితుల్లోనూ ఈ ఏడాది నిర్దేశించుకున్న ఉత్పత్తి లక్ష్యానికి చేరుకుంటాం..వ్యాపార విస్తరణకోసం పెట్టుబడుల ప్రక్రియ కొనసాగుతున్నదని కంపెనీ సీఎండీ సుమిత్ దేబ్ తెలిపారు. ఏప్రిల్-డిసెంబర్ మధ్యకాలంలో రూ.19,179 కోట్ల ఆదాయంపై రూ.7,583 కోట్ల నికర లాభాన్ని గడించింది. అలాగే 10.65 మిలియన్ టన్నుల ఖనిజాన్ని ఉత్పత్తి చేసిన సంస్థ 9.85 మిలియన్ టన్నుల విక్రయాలు జరిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Interim Dividend
- NMDC
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

