Nita Ambani | రిలయన్స్ ఫౌండేషన్ ఫౌండర్ చైర్ పర్సన్ నీతా అంబానీ బాలల దినోత్సవం సందర్భంగా గురువారం కీలక ప్రకటన చేశారు. బాలల దినోత్సవం సందర్భంగా తన ఫౌండేషన్ ప్రణాళిక వెల్లడించారు. సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ దవాఖాన ద్వారా పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల స్క్రీనింగ్, చికిత్స ఉచితంగా అందిస్తామని తెలిపారు. 50 వేల మంది బాలలకు ఈ సౌకర్యం అందుబాటులోకి తెస్తామన్నారు. దీంతోపాటు పది వేల మంది కౌమార బాలికలకు ఉచితంగా గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇస్తామని తెలిపారు. సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ దవాఖాన ద్వారా గత పదేండ్లుగా ఆమె పలువురి జీవితాల్లో వెలుగులు నింపారు. భావి భారత పౌరుల మోములో ఆనందం, వారి భవిష్యత్‌కు సాకారం అందించే లక్ష్యంగా తామీ చర్యలు చేపడుతున్నట్లు నీతా అంబానీ తెలిపారు.