Nirmala Sitharaman | 2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్‌ను (Union Budget)ను కేంద్రం ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) లోక్‌సభ ముందుకు తీసుకెళ్లారు. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగానే లోక్‌సభలో బడ్జెట్‌పై ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా నిర్మలమ్మ పలు రికార్డులను బ్రేక్ చేశారు. వరుసగా ఎనిమిదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు.
ఇక చరిత్రలో సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాలు చేసిన మంత్రుల జాబితాలో ప్రముఖంగా నిలిచిన నిర్మలమ్మ.. ఈసారి తక్కువ సమయంలోనే తన ప్రసంగాన్ని ముగించారు. కేవలం 75 నిమిషాలు మాత్రమే (గంటా 15 నిమిషాలు) బడ్జెట్ ప్రసంగం చేశారు. ఉదయం 11 గంటలకు బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన నిర్మలమ్మ 12:15కు ముగించారు. ఇప్పటి వరకూ నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగాల్లో ఇదే రెండో అతి చిన్న బడ్జెట్ ప్రసంగంగా (2nd Shortest Budget Speech) నిలిచింది. గతేడాది (2024) సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో కేంద్రం మధ్యంతర బడ్జెట్ ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ఆ సమయంలో నిర్మలమ్మ కేవలం 56 నిమిషాలు మాత్రమే ప్రసంగించారు. నిర్మలమ్మ ప్రసంగాల్లోకెళ్లా ఇదే అతి చిన్నది. ఆ తర్వాత ఇవాళ ప్రసంగమే.
ఇక ఎక్కువసార్లు పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగా, అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన మంత్రిగా నిర్మలమ్మకు రికార్డు ఉంది. ఆమె బడ్జెట్ ప్రసంగాల్లో 2020లో చేసిన బడ్జెట్ ప్రసంగం అత్యంత సుదీర్ఘమైనది. అప్పుడు ఆమె ఏకంగా 2 గంటల 40 నిమిషాల పాటు సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసి రికార్డు సృష్టించారు. బడ్జెట్ చరిత్రలో ఇదే ఇప్పటి వరకూ సుదీర్ఘ ప్రసంగంగా కొనసాగుతోంది. ఆ బడ్జెట్లోని కీలక ప్రకటనల్లో కొత్త ఆదాయపు పన్ను స్లాబులు, ఎల్‌ఐసీఐపీవో, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, ఉద్యోగాలపై ఆమె సుదీర్ఘ ప్రసంగం చేశారు. బడ్జెట్‌ను తొలిసారి ప్రవేశపెట్టిన 2019లో ఆమె ప్రసంగం 2 గంటల 17 నిమిషాల పాటు సాగింది. ఇది రెండో అతిపెద్ద బడ్జెట్ ప్రసంగం.
Also Read..
Union Budget 2025 | కేంద్ర బడ్జెట్లో రంగాల వారీగా కేటాయింపులు
Gig Workers | కేంద్ర బడ్జెట్.. గిగ్ వర్కర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్థిక మంత్రి