IT Growth : కరోనా మహమ్మారి ఆపై ఆర్ధిక మందగమనంతో కుదేలైన ఐటీ పరిశ్రమ క్రమంగా పుంజుకుంటోంది. 2024-27 ఆర్ధిక సంవత్సరాల మధ్య దేశీ ఐటీ రంగం రెండంకెల వృద్ధి రేటు సాధిస్తుందని నిర్మల్ బంగ్ ఈక్విటీస్ నివేదిక వెల్లడించింది. ఈ కాలంలో ఐటీ రంగ ఆదాయ వార్షిక వృద్ధి రేటు 17.5 శాతం నమోదవుతుందని ఈ నివేదిక అంచనా వేసింది.
పలు డీల్స్, మార్జిన్లలో నిలకడ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్స్ సేవలకు డిమాండ్ కొనసాగడం వంటి కారణాలతో ఐటీ రంగంలో ఆశాజనక వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. ముఖ్యంగా క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్‌సెక్యూరిటీ, జనరేటివ్ ఐటీ విభాగాల్లో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సేవలకు అనూహ్య డిమాండ్ నెలకొంటుందని ఈ నివేదిక అంచనా వేసింది. 2024-27 మధ్య ప్రతి షేరుకు వచ్చే ఆదాయం (EPS) రెండంకెల వృద్ధి రేటు (17.5) నమోదు చేస్తుందని తాము అంచనా వేస్తున్నామని నివేదిక తెలిపింది.
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఈ రంగంలో ఒప్పందాల విలువ 100.7 బిలియన్ డాలర్లని తెలిపింది. ఇది 16.6 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు చేసిందని వెల్లడించింది. మార్కెట్లో ఒడిదుడుకులున్నా ఈ స్ధాయి డీల్స్ సాధించడం ఐటీ రంగంలో నిలకడను సూచిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో ఉన్న మధ్యకాలిక, దీర్ఘకాలిక అవకాశాలే రాబోయే మూడేండ్లలో ఐటీ రంగ సామర్ధ్యాన్ని నిర్ధేశిస్తాయని చెబుతున్నారు.
Read More :
MGM Hospital | ఎంజీఎం హాస్పిటల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని గొలుసుతో కట్టేసి దాడి..వీడియో