ముంబై, జూన్ 12: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలతో భారీగా పుంజుకున్న సూచీలకు చివర్లో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపడంతో భారీ లాభాలను నిలుపుకోలేకపోయింది. బ్లూచిప్ షేైర్లెన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు లాభాపడటం మదుపరుల్లో సెంటిమెంట్‌ను మెరుగుపరిచింది. వడ్డీరేట్లపై అమెరికా ఫెడరల్ నిర్ణయాన్ని ప్రకటించనున్నప్పటికీ పెట్టుబడిదారులను కొనుగోళ్ల వైపు నడిపించాయి. ఇంట్రాడేలో 600 పాయింట్ల వరకు లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివర్లో 149.98 పాయింట్లు అందుకొని 76,606.57 వద్ద నిలిచింది. మరో సూచీ నిఫ్టీ రికార్డు స్థాయికి ఎగబాకింది. ఇంట్రాడేలో 177.1 పాయింట్లు అందుకొని చారిత్రక గరిష్ఠ స్థాయి 23,441.95 పాయింట్లను తాకిన సూచీ చివరికి 58.10 పాయింట్లు పెరిగి 23,322.95 వద్ద స్థిరపడింది. సూచీలకు ఇది కూడా గరిష్ఠ స్థాయి కావడం విశేషం.
మార్కెట్లు భారీగా పుంజుకోవడంలో మదుపరుల సంపద కూడా అంతే స్పీడ్‌తో పెరుగుతున్నది. బుధవారం స్టాక్ మార్కెట్ ముగిసే సమయానికి బీఎస్ఈలో లిైస్టెన సంస్థల విలువ రూ.4,29,32,991.65 కోట్లు(5.14 ట్రిలియన్ డాలర్లు) చేరుకున్నది. ఇది కూడా చారిత్రక గరిష్ఠ స్థాయి.