న్యూఢిల్లీ, మే 16: ప్రభుత్వరంగ సంస్థ ఎన్‌హెచ్‌పీసీ అంచనాలకు మించి రాణించింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థ రూ.1,549.42 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.919.63 కోట్ల లాభంతో పోలిస్తే 68 శాతం వృద్ధి నమోదైంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.2,557. 71 కోట్ల నుంచి రూ.3,120.52 కోట్లకు ఎగబాకింది.
2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.12,686 కోట్ల ఆదాయంపై రూ.4,220 కోట్ల నికర లాభాన్ని గడించింది. మరోవైపు, రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు 21 పైసలు తుది డివిడెండ్‌ను ప్రకటించింది.