న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ హైడ్రో పవర్ దిగ్గజం ఎన్‌హెచ్‌పీసీ.. ఈ ఆర్థిక సంవత్సరానికి (2022-23)గాను కేంద్రానికి రూ. 997.75 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించింది. గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. కాగా, తాజా డివిడెండ్‌తో ఇప్పటిదాకా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వానికి చెల్లించిన డివిడెండ్ రూ.1,354.09 కోట్లకు చేరింది.