న్యూఢిల్లీ : భారత్‌లో యమహ ఎట్టకేలకు న్యూ ఆర్15 బైక్‌ను లాంఛ్ చేసింది. ఎంట్రీ లెవెల్ స్పోర్ట్స్ బైక్‌లో ఇది నాలుగో జనరేషన్ మోడల్ బైక్ కాగా, ఇది స్టాండర్డ్, హయ్యార్ స్సెక్ ఎం రెండు వెర్షన్లలో అందుబాటులో ఉంది. 2021 యమహ ఆర్15 ధర రూ 1,67,800 కాగా, ఆర్15ఎం రూ 1,77,800 (ఎక్స్‌షోరూం)లకు లభిస్తుంది. ఆర్15 బైక్ లాంఛ్‌పై గత కొద్దినెలలుగా ఊరిస్తున్న యమహ తాజాగా స్పోర్ట్స్ బైక్‌కు సంబంధించిన వివరాలను ప్రకటించింది.
ప్రపంచ మార్కెట్లలో ముందుగా భారత్‌లోనే ఈ బైక్ అమ్మకాలు ప్రారంభం కానుండటం విశేషం. ఇక పాత మోడల్‌తో పోలిస్తే న్యూ యమహ ఆర్15 భిన్నమైన లుక్‌తో కస్టమర్లను ఆకట్టుకోనుంది. 2021 ఆర్15 బైక్ మాస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, పొడవైన విండ్‌స్ర్కీన్ వంటి ఫీచర్లను జోడించారు. ఇక న్యూ ఆర్15తో పాటు యమహ భారత్‌లో ఏరక్స్ స్కూటర్‌నూ ప్రవేశపెట్టింది. ఇది రూ 1,29,000 (ఎక్స్‌షోరూం)కు అందుబాటులో ఉంటుందని పేర్కొంది.