ముంబై, జూలై 23: ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనో ఇండియా..దేశీయ మార్కెట్లోకి నయా ట్రైబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు రూ.6.29 లక్షల నుంచి రూ.9.16 లక్షల గరిష్ఠ ధరల్లో లభించనున్నది.
ఏడుగురు కూర్చోవడానికి వీలుండే విధంగా డిజైన్ చేసిన ఈ కారును 35 అప్డేటెడ్ ఫీచర్స్‌తో తీర్చిదిద్దింది. ఎనిమిది ఇంచుల ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ డిస్ప్లే, వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు కలిగివున్నది.