న్యూఢిల్లీ : ఆల్ న్యూ మారుతి సుజుకి సెలెరియోను భారత్ మార్కెట్లో మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ లాంఛ్ చేసింది. న్యూ సెలెరియో రూ 4.99 లక్షల నుంచి రూ 6.94 లక్షల మధ్య అందుబాటులో ఉంటుంది. కంపెనీ హార్టెక్ ప్లాట్‌ఫాంపై న్యూ మారుతి సుజుకి సెలెరియో రూపొందింది. లీటర్‌కు 26.68 కిలోమీటర్ల మైలేజ్‌తో న్యూ సెలెరియో మెరుగైన ఇంధనం ఆదా చేసే పెట్రోల్ కారుగా ఆదరణ పొందుతుందని కంపెనీ ఆశిస్తోంది.
దేశీ మార్కెట్లో ఈ వాహనం హ్యుందాయ్ శాంట్రో, టాటా టియాగో, డాట్సన్ గో వంటి కార్లకు ఇది దీటైన పోటీ ఇవ్వనుంది. దేశంలో పాసింజర్ వెహికల్ సెగ్మెంట్లో ఆల్ న్యూ సెలెరియో కీలక వాహనంగా నిలుస్తుందని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ఎండీ, సీఈఓ కెనిచి అయుకవ విశ్వాసం వ్యక్తం చేశారు.
ఇక న్యూ సెలెరియో స్టైలిష్ డిజైన్‌తో కస్టమర్లను ఆకట్టుకోనుంది. స్వీపింగ్ ఫ్రంట్ హెడ్‌ల్యాంప్, డ్రాప్లెట్ స్టైల్డ్ టెయిల్ ల్యాంప్స్, క్రోం ఫినిష్‌తో న్యూ సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్ వంటి ఇంటీరియర్ ఫీచర్లు కారుకు న్యూ జనరేషన్ స్టైలిష్ లుక్‌ను తీసుకువచ్చాయి. 15 ఇంచ్ బ్లాక్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్ వెహికల్‌కు మరింత స్టైలిష్ లుక్ తెచ్చాయి.