న్యూఢిల్లీ, డిసెంబర్ 18: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల (ఆర్ఆర్బీ) కోసం ఓ కొత్త లోగోను ఆవిష్కరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 28 ఆర్ఆర్బీలున్నాయి. 700 జిల్లాల్లో 22వేలకుపైగా శాఖలతో ఇవి సేవలందిస్తున్నాయి.
నిజానికి ఆర్థిక శాఖ 11 రాష్ర్టాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 26 ఆర్ఆర్బీలను విలీనం చేసింది. ఈ ఏడాది మే 1 నుంచే ఈ మార్పులు అమల్లోకి వచ్చాయి. ఈ క్రమంలో ఇప్పుడు నూతన లోగోనూ పరిచయం చేశారు. ‘వన్ స్టేట్ వన్ ఆర్ఆర్బీ’ నినాదంతోనే ఈ కామన్ లోగోను తీసుకొచ్చింది మోదీ సర్కారు.