న్యూఢిల్లీ, మార్చి 9: దేశీయ మార్కెట్లోకి సరికొత్త వెర్నాను విడుదల చేసింది హ్యుందాయ్ మోటర్ ఇండియా. ఈ కారు ప్రారంభ ధర రూ.10.98 లక్షలుగా నిర్ణయించింది. పాత మాడల్‌తో పోలిస్తే ఈ నయా మాడల్‌ను మరింత ఆధునీకరించి, ముఖ్యంగా లోపల, బయట భాగంలో సెడాన్‌గా తీర్చిదిద్దినట్టు పేర్కొంది.
1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో తీర్చిదిద్దిన ఈ మాడల్ మాన్యువల్, ఆటోమేటిక్ మాడల్ లభించనున్నది. 360 డిగ్రీల కెమెరాలు, అడాస్ స్యూట్, ఎనిమిది స్పీకర్లు, బ్లైండ్ స్పాట్ మానిటర్ వంటి టెక్నాలజీతో తయారు చేసింది.